Shree Karthick: అల్లు అర్జున్‌కి కథ వినిపిస్తా!
‘‘నేనుకున్న కథని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టింది. అన్నేళ్ల నా నిరీక్షణకి... కష్టానికీ తగిన ఫలితమే దక్కింది’’ యువ దర్శకుడు శ్రీకార్తీక్. సైన్స్‌నీ... భావోద్వేగాల్నీ మేళవిస్తూ ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ కథానాయకుడిగా నటించారు.
‘‘నేనుకున్న కథని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టింది. అన్నేళ్ల నా నిరీక్షణకి... కష్టానికీ తగిన ఫలితమే దక్కింది’’ యువ దర్శకుడు శ్రీకార్తీక్. సైన్స్‌నీ... భావోద్వేగాల్నీ మేళవిస్తూ ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ కథానాయకుడిగా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శితవుతోంది. ఈ సందర్భంగా శ్రీకార్తీక్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘నేను ఫిలిం మేకర్ అవుతానని కూడా మా అమ్మకి తెలియదు. నేను లఘు చిత్రాలు తీస్తున్న సమయానికే అనారోగ్యంతో సతమతమవుతున్నారు. ఎలాగైనా నేను తీసిన లఘు చిత్రాల్ని అమ్మకి చూపించాలనుకున్నా. కానీ తను అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు. చాలా బాధగా అనిపించేది. కాలం వెనక్కి వెళితే బాగుండేది కదా అనిపించేది. ఆ ఆలోచన నుంచే ‘ఒకే ఒక జీవితం’ కథకి బీజం పడింది. స్వతహాగా నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ప్రేక్షకులకు సాహసోపేతమైన ఓ ప్రయాణ అనుభూతిని అందించడం కోసం ఈ కథని సైన్స్‌తో ముడిపెట్టి రాశా. లేదంటే ఈ కథ ఓ మెలోడ్రామాగా నిలిచిపోయేది. నా ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చింది. సినిమా మేం అనుకున్న విజయం సాధించింది’’.
* ‘‘ఓపికతో ఉండాలి, మనం చేసే పనిలో నిజాయతీ ఉంటే మనకి ఈ విశ్వం కూడా తోడవుతుంది. ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా సందర్భంలో నాకు అనుభవంలోకి వచ్చిన విషయమిది. ఈ సినిమా కథ రాయడానికి నాకు రెండేళ్లు పట్టింది. కథకి తగ్గ హీరో కుదరడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. కొవిడ్ వల్ల రెండేళ్లు... ఇలా మొత్తం సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టింది. కానీ ఎప్పుడూ నిరుత్సాహానికి గురికాలేదు. అదే నాకు గొప్ప ఫలితాన్ని తెచ్చిపెట్టింది. చూసిన ప్రతి ఒక్కరికీ సినిమా కనెక్ట్ అవుతుండడంతో తలపై బరువు దిగిన భావన కలుగుతోంది. శర్వానంద్ నటించడంతోనే ఈ సినిమా విజయవంతమైంది’’.
* ‘‘సినిమా చూసిన తర్వాత కథానాయకుడు నాగార్జున శర్వానంద్‌తో మాట్లాడుతూ ‘ఇకపై నిన్ను నా కొడుకులా చూస్తా’ అన్నారు. అది నాకు దొరికిన కాంప్లిమెంట్‌లానే భావిస్తా. అఖిల్ కూడా ఈ సినిమా చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు ఆ సినిమా గురించి కాకుండా జీవితం గురించి మాట్లాడుకుంటాం. అది ‘ఒకే ఒక జీవితం’ విషయంలో జరిగింది. మారుతితోపాటు, పలువురు దర్శకులు ఫోన్ చేసి సినిమా గురించి గొప్పగా చెప్పారు. ఇలాంటి సినిమాలకి ట్రెండ్‌సెట్టర్ సింగీతం శ్రీనివాసరావు సర్. ఆయన్ని కలిసి సినిమా చూపించాలని ఉంది’’.
* ‘‘మా అమ్మ తెలుగువారే. బి.ఎస్.ఎన్.ఎల్‌లో అధికారిగా పనిచేశారు. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. నా తదుపరి సినిమా తెలుగులోనే ఉంటుంది. భారీ స్థాయిలో థియేటర్ అనుభూతిని పంచే సినిమానే చేస్తాం. అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఉంది. నా దగ్గర ఉన్న ఓ ఫాంటసీ కథని ఆయనకి వినిపించాలి. మా కుటుంబంలో అందరూ అల్లు అర్జున్ అభిమానులే. ఆయనతో సినిమాకోసం ఐదేళ్లు నిరీక్షించడానికైనా సిద్ధమే. నా కెరీర్‌లో ఐదే సినిమాలు చేసినా సరే, అవి మంచి సినిమాలుగా ఉండాలన్నదే నా అభిమతం’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం