Naga Chaitanya: కథ బాగుంటే థియేటర్‌కి వస్తారు

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది.

Updated : 14 Sep 2022 05:47 IST

సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకులు నాగచైతన్య, అడివి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ, అవసరాల శ్రీనివాస్‌తోపాటు దర్శకులు హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, వెంకీ కుడుముల, రాహుల్‌ సంకృత్యాన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘‘ఈమధ్య థియేటర్‌ ఏమైపోతోంది? ప్రేక్షకులు వస్తారా రారా? అంటూ అంతా  భయపడ్డారు. కథ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమాని ఆస్వాదిస్తారు. ఈ మధ్య సినిమాలు అదే విషయాన్ని నిరూపించాయి. ఈ సినిమా కూడా తప్పక విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. సుధీర్‌, నా ప్రయాణం ‘ఏమాయ చేసావె’తో మొదలైంది. అక్కడ ఐదు నిమిషాల ఫైట్‌ సీక్వెన్స్‌ చేశాడు. ఇప్పుడు ఏ సినిమానైనా భుజాలపై మోసేలా ఆల్‌రౌండ్‌ నటుడు అయ్యాడు. కృతిశెట్టి కథానాయికగా చాలా దూరం ప్రయాణిస్తుంది’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని