వస్తున్నాడు అతనే!

కథానాయకుడు ధనుష్‌ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం ‘నానే వరువేన్‌’. తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్ట్స్‌ సమర్పణలో విడుదలవుతోంది.

Published : 15 Sep 2022 02:25 IST

థానాయకుడు ధనుష్‌ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం ‘నానే వరువేన్‌’. తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో గీతా ఆర్ట్స్‌ సమర్పణలో విడుదలవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ‘‘ధనుష్‌ - సెల్వరాఘవన్‌ కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కలయికకి తోడు, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం, ఓం ప్రకాష్‌ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటీవలే సినిమా విడుదల గురించి చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌.థాను హైదరాబాద్‌లో గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ని కలిశార’’ని సినీ వర్గాలు తెలిపాయి. యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్‌, ఎల్లి అవ్రామ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: ధనుష్‌, సెల్వరాఘవన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని