దసరా నుంచే...

‘ఆదిపురుష్‌’ ప్రచారం షురూ కానుందా? దసరా నవరాత్రుల్లోనే అందుకు ముహూర్తం పెట్టారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రభాస్‌ కథానాయకుడిగా ఓంరౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతికతతో...

Published : 15 Sep 2022 02:28 IST

‘ఆదిపురుష్‌’ ప్రచారం షురూ కానుందా? దసరా నవరాత్రుల్లోనే అందుకు ముహూర్తం పెట్టారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రభాస్‌ కథానాయకుడిగా ఓంరౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతికతతో... భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టడానికి దసరా ఉత్సవాల్ని మించిన మంచి సమయం మరొకటి దొరకదని భావించిన చిత్రబృందం.... ఆ మేరకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేలా ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు అక్టోబరు 3న లుక్‌ విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌... రాఘవగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌గా, సన్నీసింగ్‌ లక్ష్మణగా నటించారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని