సినిమా నచ్చితేనే చెప్పండి

‘‘సినిమా చూశాక నచ్చితేనే మీ స్నేహితులకి చెప్పండి. ప్రతి ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి ఓ మంచి అనుభవాన్ని ఇంటికి తీసుకెళ్లేలా సినిమా ఉంటుంది’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా

Updated : 16 Sep 2022 06:18 IST

‘‘సినిమా చూశాక నచ్చితేనే మీ స్నేహితులకి చెప్పండి. ప్రతి ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి ఓ మంచి అనుభవాన్ని ఇంటికి తీసుకెళ్లేలా సినిమా ఉంటుంది’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నేను మీకు బాగా కావల్సినవాడిని’. సంజన, సోనాల్‌ ఠాకూర్‌ కథానాయికలు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించారు. కోడి దివ్యదీప్తి నిర్మాత. శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘కిరణ్‌ అబ్బవరం ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ సినిమాతో అందరికీ బాగా కావల్సినవాడు అయిపోయాడు. ఈ సినిమాతో విజయం సాధించి మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నా. దివ్యదీప్తి మంచి నిర్మాతగా పేరుతోపాటు విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘పక్కా వినోదంతో రూపొందిన చిత్రమిది. ఇంటిల్లిపాదీకలిసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, దర్శకుడు వశిష్టతోపాటు చిత్రబృందం పాల్గొంది.


జర్నీ లవర్‌ శుభ

శోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా... ఆర్‌.ఎ.కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆకాశం’. అపర్ణ బాలమురళి, శివాత్మిక, రీతూవర్మ కథానాయికలు. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోని  కథానాయికల పాత్రల లుక్స్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రైతు కుమార్తె మతి పాత్రలో అపర్ణ బాలమురళి, కాలేజ్‌ స్టూడెంట్‌ మీనాక్షి పాత్రలో శివాత్మిక, ప్రయాణాల్ని ఇష్టపడే అమ్మాయి శుభ పాత్రలో రీతూవర్మ నటిస్తున్నట్టు తెలిపాయి సినీ వర్గాలు. గోపీసుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


విష్ణుమహత్యం

శ్రీ మహావిష్ణువు మహత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం భక్తిరస చిత్రం ‘శ్రీరంగనాయక’. మహావిష్ణువు పాత్రలో దుండిగల్‌ వినయ్‌రాజ్‌ నటించారు. నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామావత్‌ మంగమ్మ నిర్మాత. డ్రమ్‌ రాము సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరు 23న చిత్రం విడులదవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. వినయ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘మహావిష్ణు పాత్రలో నటించడం నా అదృష్టం. మన సంస్కృతిని చెప్పే కథతో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రంగబాషా, లంకెల అశోక్‌రెడ్డి, కుప్పిలి శ్రీనివాసరావు, గబ్బర్‌సింగ్‌ సాయి, రాజలింగం, బుచ్చిరెడ్డి, వెంకన్న, భాస్కర్‌ యాదవ్‌, అర్‌.కె.క్రిషేనా, ఎస్‌.శ్రీనివాస్‌, సౌమ్య, రామచంద్ర, శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని