తెలవారెనే సామి...

‘‘చిన్న వయసులో  హీరో కావడంతో కాలేజీ రోజుల్ని మిస్‌ అయ్యాను. ఈ సినిమా నాకు ఆ రోజుల్ని గుర్తు చేసింద’’న్నారు త్రిగుణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’.

Published : 20 Sep 2022 04:57 IST

‘‘చిన్న వయసులో  హీరో కావడంతో కాలేజీ రోజుల్ని మిస్‌ అయ్యాను. ఈ సినిమా నాకు ఆ రోజుల్ని గుర్తు చేసింద’’న్నారు త్రిగుణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. మేఘా ఆకాష్‌ కథానాయిక. మాయ, అజయ్‌ కతుర్వార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వం వహించారు. శిరీష సిద్ధమ్‌ నిర్మాత. మణిశర్మ స్వరకర్త. అక్టోబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా త్రిగుణ్‌ మాట్లాడుతూ ‘‘తల్లి కొడుకుల బంధం నేపథ్యంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇందులో నాకు అమ్మగా మధుబాల నటించారు. మేఘ ఆకాష్‌తో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రంలోని ‘తెలవారెనే సామి...’ అంటూ సాగే పాటని సోమవారం విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు