సోషల్‌ హంగామా

సామాజిక మాధ్యమాల పుణ్యమాని సినిమా తారలు..అభిమానుల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. నిత్యం అభిమానుల్ని అలరించడానికి తమకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఆదివారం నాడు పలువురు స్టార్‌లు ఆసక్తికర సంగతులు అభిమానుల ముందుంచారు.

Published : 26 Sep 2022 05:02 IST

సామాజిక మాధ్యమాల పుణ్యమాని సినిమా తారలు..అభిమానుల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. నిత్యం అభిమానుల్ని అలరించడానికి తమకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఆదివారం నాడు పలువురు స్టార్‌లు ఆసక్తికర సంగతులు అభిమానుల ముందుంచారు.


నా ప్రపంచానికి సితార నువ్వు

హేష్‌బాబు స్టార్‌ హీరో..అంతకంటే మంచి తండ్రి కూడా. ఎందుకంటే సినిమాలతో ఎంత తీరిక లేకుండా ఉన్నా సరే కుటుంబానికి, ముఖ్యంగా పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. వాళ్లతో గడపాల్సిన టైమ్‌ సరదాగా గడిపేస్తుంటారు. మహేష్‌కు తన కూతురు సితార అంటే మరింత ప్రేమ. ఆదివారం ‘డాటర్స్‌ డే’ సందర్భంగా కూతురు సితారతో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకున్నారు మహేష్‌. నీతో నా ప్రపంచం ఎప్పుడూ ప్రకాశవంతమే..అని రాశారాయన.  ఈ మధ్య ఇద్దరూ కలిసి ఈ మధ్య ఓ యాడ్‌లో కూడా సందడి చేశారు. ఇక సోషల్‌ మీడియాలో సితార చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆమెకంటూ ప్రత్యేకంగా ఎంతో ఫాలోయింగ్‌ ఉంది.


కత్తి పట్టిన కాజల్‌

దనరంగంలోకి దూకనుంది కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. అందుకోసం కత్తి చేతపట్టి ప్రాచీన యుద్ధ విద్యల్ని నేర్చుకొంటోంది. ఇదంతా  కూడా  ‘భారతీయుడు2’ కోసమే. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్ల కిందట  పునః ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న కాజల్‌ మళ్లీ సెట్స్‌పైకి దిగేందుకు సన్నాహాలు చేసుకొంటోంది. అందులో భాగంగానే కలరియపట్టు అనే యుద్ధ విద్యలో శిక్షణ తీసుకొంటోంది. కాజల్‌ శిక్షణలో ఉండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. కొన్ని నెలల కిందటే ఓ బాబుకి జన్మనిచ్చిన కాజల్‌... మళ్లీ కెరీర్‌ కోసం కెమెరా ముందుకొచ్చేందుకు కొన్నాళ్లుగా తనని తాను తీర్చిదిద్దుకొంటోంది. ఆమె సన్నాహాల్ని చూస్తుంటే ‘భారతీయుడు2’లో పోరాట ఘట్టాల్లోనూ సందడి చేయనుందని స్పష్టమవుతోంది.


ఫ్యామిలీ మ్యాన్‌కు యాక్షన్‌ మ్యాన్‌ మేకప్‌

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మేకప్‌ మేన్‌ అవతారం ఎత్తారు. మేకప్‌ చేయించుకుంటుందేమో ఫ్యామిలీ మేన్‌ జగపతి బాబు. ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. కృష్ణ, దాస్‌...కేడీ అండ్‌ కో కంపెనీ అనగానే ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రంలో ఈ ఇద్దరు హీరోలు పంచిన వినోదాలే గుర్తొస్తాయి. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ ఇలా ఎందుకు కలిశారో తెలియదు కానీ ఆదివారం స్పెషల్‌ అంటూ ఈ ఫొటోను పంచుకున్నారు జగపతిబాబు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘కొత్త ప్రాజెక్ట్‌ కోసం...’ అని కొందరు ‘కేడీ అండ్‌ కో కంపెనీ ఆన్‌ డ్యూటీ’ అని కొందరు ఇలా కామెంట్లు చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని