‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తక ప్రయత్నం అభినందనీయం: కృష్ణ

సీనియర్‌ సినీ పాత్రికేయులు వినాయకరావు రాసిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ను పుస్తకం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను

Published : 26 Sep 2022 18:59 IST

హైదరాబాద్‌: సీనియర్‌ సినీ పాత్రికేయులు వినాయకరావు రాసిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ను పుస్తకం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అలనాటి నటుడు కృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. వినాయకరావు ఇంతవరకూ ఎన్టీఆర్, దాసరి, రామానాయుడులతో పాటు, తన సినీ జీవిత విశేషాలు, నటించిన చిత్రాల వివరాలతో ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకం రాశారని గుర్తు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు సినీ పాత్రికేయుల చరిత్రకు అక్షర రూపం ఇస్తున్న ఆయన ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు.

హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘84 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ చరిత్రని అక్షరాల్లో పెట్టాలని అనుకోవడం సాహసం. కానీ ఎంతో మంది జీవిత చరిత్రలు రాసిన వినాయకరావుకి ఇది సాధ్యమే’నని శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పుస్తకం పూర్తయిందని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రచయిత వినాయకరావు వెల్లడించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని