నా కోసం వస్తున్నారు.. నా స్వరమే వినిపించాలి

‘‘ఏ భాషలో చేసినా సరే.. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటా. అప్పుడే నటిగా నాకు పూర్తి సంతృప్తిగా ఉంటుంది’’ అంటోంది నటి రష్మిక. ఇందుకోసం ఎంత కష్టానికైనా వెనకాడనని చెబుతోంది ఈ కన్నడ కస్తూరి. ‘‘ప్రేక్షకులు నా కోసం వస్తున్నప్పుడు

Published : 27 Sep 2022 02:25 IST

‘‘ఏ భాషలో చేసినా సరే.. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటా. అప్పుడే నటిగా నాకు పూర్తి సంతృప్తిగా ఉంటుంది’’ అంటోంది నటి రష్మిక. ఇందుకోసం ఎంత కష్టానికైనా వెనకాడనని చెబుతోంది ఈ కన్నడ కస్తూరి. ‘‘ప్రేక్షకులు నా కోసం వస్తున్నప్పుడు నా ముఖం కనిపించాలి. నా స్వరమే వినిపించాలి. పాత్రగా నేను కనిపించి.. మరొకరి స్వరం వినిపిస్తే నటిగా నాకు సంతృప్తి ఏముంటుంది. అందుకే ఏ భాషలో చేసినా సరే.. ఆ భాష నేర్చుకొని మరీ నా సొంత గొంతు వినిపించే ప్రయత్నం చేస్తుంటా. ఇప్పటికీ రోజూ షూట్‌ పూర్తయి ఇంటికెళ్లగానే ఓ గంట పాటు ఆయా భాషల క్లాస్‌లు తీసుకుంటుంటా. ఇలా ప్రస్తుతం హిందీ, తమిళం నేర్చుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది రష్మిక. ఆమె ఇప్పుడు హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో విజయ్‌తో కలిసి ‘వారిసు’ చిత్రం చేస్తోంది. తెలుగులో ‘పుష్ప2’ చేయనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts