Naga Shaurya: ఒత్తిడి పోగొట్టే చిత్రమిది

నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా అనీష్‌ ఆర్‌.కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఉషా ముల్పూరి నిర్మాత. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైన సందర్భంగా తాజాగా

Updated : 29 Sep 2022 07:21 IST

నాగశౌర్య (Naga Shaurya), షిర్లీ సేథియా (Shirley Setia) జంటగా అనీష్‌ ఆర్‌.కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari). ఉషా ముల్పూరి నిర్మాత. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైన సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో థ్యాంక్‌ యూ మీట్‌ నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘చాలా మంచి చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి చాలా మంచి ఆదరణ దక్కుతోంది. వసూళ్లు పెరుగుతున్నాయి. మేము.. పంపిణీదారులు అంతా ఆనందంగా ఉన్నాం. మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు అనీష్‌కు, నిర్మాతైన మా అమ్మకు థ్యాంక్స్‌. సినిమా ఇంకా చూడనివారు థియేటర్‌కు రండి. కచ్చితంగా ఆనందిస్తారు’’ అన్నారు. ‘‘ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం. రెండు గంటల పాటు అన్ని ఒత్తిళ్లు పోగొట్టి మనసుని హాయితో నింపుతుంది’’ అన్నారు నిర్మాత ఉషా ముల్పూరి. ఈ వేడుకలో శంకర్‌ ప్రసాద్, సత్య, రాహుల్‌ రామకృష్ణ, హిమజ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని