GINNA: దీపావళికి ‘జిన్నా’ వినోదం

‘‘మా సినిమాని ఇప్పుడు విడుదల చేస్తే వంద థియేటర్లు దొరుకుతాయేమో... అదే దీపావళికయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో లభిస్తాయి. ప్రచారానికీ తగినంత సమయం దొరుకుతుంది’’ అన్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన

Updated : 30 Sep 2022 09:15 IST

‘‘మా సినిమాని ఇప్పుడు విడుదల చేస్తే వంద థియేటర్లు దొరుకుతాయేమో... అదే దీపావళికయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో లభిస్తాయి. ప్రచారానికీ తగినంత సమయం దొరుకుతుంది’’ అన్నారు మంచు విష్ణు (Manchu Vishnu). ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘జిన్నా’ (GINNA). సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబరు 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు మంచు విష్ణు. ఆయన మాట్లాడుతూ ‘‘అక్టోబరు 5న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.  

‘మా’ ఎన్నికల నుంచే ఇలా...

సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోల్స్‌ గురించి స్పందించారు మంచు విష్ణు. ‘‘మా (MAA) ఎన్నికల సమయం నుంచే నాపై ట్రోల్స్‌ మొదలయ్యాయి. సరిగ్గా సినిమా విడుదలకి ముందు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదంతా పెయిడ్‌, పైసా వసూల్‌ బ్యాచ్‌లే చేస్తున్నాయి. ఇలాంటివి పట్టించుకోవల్సిన అవసరం లేదు. కానీ బయట జనం తప్పుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. దీని వెనక ఎవరున్నారనే విషయం బయటికొస్తే వాళ్ల పరువు పోతుంది. మేం ఆరా తీసినప్పుడు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ నటుడి కార్యాలయం ఐపీ అడ్రస్‌, చెక్‌పోస్ట్‌ దగ్గర ఓ కార్యాలయం ఐపీ అడ్రస్‌ బయటికొచ్చింది. ఒక గ్రూప్‌లో ఇలా కామెంట్లు చేయండని చెప్పగానే గంటన్నర లోపలే అంతా చేసేస్తున్నారు. ఇవన్నీ పోలీసులు చెబితేనే తెలిసింది. వీటిని కూడా పట్టించుకున్నానంటే పరిశ్రమలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ నాపైన ఇంత డబ్బు పెట్టుబడి పెట్టి ఇలా చేయించడమే కామెడీ. ఇలాంటి ట్రోల్స్‌ మాపైనే జరుగుతున్నాయా? అందరినీ చేస్తున్నారా అనేది త్వరలోనే బయటకొస్తుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని