Yash: పెద్దమ్మను మించే గన్‌ కోసమేనా!

కేజీఎఫ్‌ 2 పేరు వినగానే మనసులో వెంటనే మెదిలేది హీరో యశ్‌ ఒక్కడే కాదు...పోలీస్‌ స్టేషన్‌ ముందు భారీ గన్‌తో రాకీ భాయ్‌ కురిపించే బుల్లెట్ల వర్షం కూడా. ఆ సన్నివేశం చివర్లో బుల్లెట్లు పేల్చిపేల్చి గన్‌ ముందుభాగం నిప్పుకణికలా మారితే దాంతో

Updated : 30 Sep 2022 09:18 IST

కేజీఎఫ్‌ 2 (KGF 2) పేరు వినగానే మనసులో వెంటనే మెదిలేది హీరో యశ్‌ (Yash) ఒక్కడే కాదు...పోలీస్‌ స్టేషన్‌ ముందు భారీ గన్‌తో రాకీ భాయ్‌ కురిపించే బుల్లెట్ల వర్షం కూడా. ఆ సన్నివేశం చివర్లో బుల్లెట్లు పేల్చిపేల్చి గన్‌ ముందుభాగం నిప్పుకణికలా మారితే దాంతో సిగరెట్‌ వెలిగిస్తాడు రాకీ. ఆ సమయంలో రాకీ భాయ్‌ మనిషి గన్‌ను చూసి ‘పెద్దమ్మ’ అని ఆశ్చర్యంగా అంటే కాదు పెద్దయ్య అని ఓ కుర్రాడు చెప్పే ఆ సీన్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అలాంటి సీన్లు ఉంటే యాక్షన్‌ ప్రియులకే పండగే. మరోసారి అలాంటి సన్నివేశాలను ప్రేక్షకులకు చూపించడానికేమో యశ్‌ గన్‌ షూటింగ్‌లో ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడు. తాజాగా తను డమ్మీ గన్‌తో ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ వీడియోని పంచుకున్నారు యశ్‌. ‘‘లక్ష్యాలను చేరుకోవడానికి ఎల్లప్పుడూ మార్గం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని కనిపెట్టడమే సవాల్‌’’ అని ట్వీట్‌ చేశాడు. ఏ సినిమా కోసం ఈ సాధనో తెలియదు కానీ కేజీఎఫ్‌ 3 కోసం అయితే కాదు. ఎందుకంటే కేజీఎఫ్‌ 3 ఉంటుందని చిత్ర వర్గాలు గతంలోనే ప్రకటించినా...అది ఇప్పుడే కాదని కూడా చెప్పాయి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని