Tollywood: నీళ్లే కాదు జ్యూస్‌లు కూడా తాగు

అందం..ఆరోగ్యం విషయంలో సినీ నటులు, ముఖ్యంగా హీరోయిన్‌లు ఓ రెండు అడుగులు ముందే ఉంటారు. గ్లామర్‌ కాపాడుకోవడానికి నిత్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మితంగా తింటారు. నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. చాలామంది

Updated : 30 Sep 2022 09:21 IST

అందం..ఆరోగ్యం విషయంలో సినీ నటులు, ముఖ్యంగా హీరోయిన్‌లు ఓ రెండు అడుగులు ముందే ఉంటారు. గ్లామర్‌ కాపాడుకోవడానికి నిత్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మితంగా తింటారు. నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. చాలామంది నాయికల వెంట నీళ్ల సీసా కచ్చితంగా ఉంటుంది. యువ కథానాయిక నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) కూడా ఫిట్‌నెస్‌ కోసం అన్ని రకాల నియమాలు పాటిస్తుంటుంది. ఇదిగో ఇలా ఓ వేడుకలో నీళ్ల బాటిల్‌తో కనిపించింది. ఆమె పక్కన సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ కూర్చొన్నారు. తెరపైనే కాదు బయట కార్యక్రమాల్లోనూ ఆయన సరదాగా ఉంటారు. తన అనుభవంతో నిధికి ఏదో చెబుతున్నట్టున్నారు. ఆమె కూడా అవును నిజమే కదా...అన్నట్టు శ్రద్ధగా వింటోంది. బ్రహ్మాజీ చెయ్యి కదలికల్ని చూస్తే ఆయన నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలోని సన్నివేశమే గుర్తొస్తుంది. నాగార్జున స్నేహితుడిగా ఓ సన్నివేశంలో.. ‘జ్యూస్‌ చేయాలంటే సపరేట్‌ హ్యాండ్‌ కావాలంటూ...’ బ్రహ్మాజీ పంచిన నవ్వులు కడుపుబ్బ నవ్వించాయి. దీన్ని బట్టి ‘నీళ్లే కాదు జ్యూస్‌లు కూడా తాగుతుండు... నిధి’ అని బ్రహ్మాజీ సలహా ఇస్తున్నారని కూడా మీరు అనుకుంటున్నారేమో. కావొచ్చు కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని