Shaakuntalam: శాకుంతలం.. త్రీడీలో

శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథను ‘శాకుంతలం’ పేరుతో తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు గుణశేఖర్‌. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. నీలిమ గుణ

Updated : 30 Sep 2022 09:23 IST

కుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథను ‘శాకుంతలం’ (Shaakuntalam) పేరుతో తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar). సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని త్రీడీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం గురువారం తెలియజేసింది. ఈ కారణంగానే చిత్రాన్ని నవంబరు 4 నుంచి మరో కొత్త తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘మేము ‘శాకుంతలం’తో ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందించాలని.. ఆ ప్రపంచంలో అందరినీ లీనమయ్యేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం త్రీడీ వెర్షన్‌ను ఒక అద్భుతమైన మార్గంగా భావించాం. దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయడానికి మాకు మరింత సమయం కావాలి. మేము త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని