‘ఇక్షు’ తర్వాత...

తొలి సినిమాతోనే నటుడిగా పేరు తెచ్చుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు రామ్‌ అగ్నివేశ్‌. తదుపరి సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పిస్తానన్నారు.

Updated : 01 Oct 2022 02:10 IST

తొలి సినిమాతోనే నటుడిగా పేరు తెచ్చుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు రామ్‌ అగ్నివేశ్‌. తదుపరి సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పిస్తానన్నారు. ‘ఇక్షు’ సినిమాతో పరిచయమైన ఆయన, అదే కలయికలో రెండో చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకురాలు రుషిక మాట్లాడుతూ ‘‘తొలి సినిమా ‘ఇక్షు’ నా కల. మా అబ్బాయిని పరిచయం చేస్తూ, నేనే దర్శకత్వం చేశా. ఆ సినిమా ఇచ్చిన విజయోత్సాహంలోనే రెండో సినిమాని ప్రారంభించాం. ఇది కూడా భిన్నమైన కథే’’ అన్నారు. రామ్‌ అగ్నివేశ్‌ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా ప్రతిభేమిటో చాటేందుకే నాతో ‘ఇక్షు’ తీశారు మా అమ్మ. అదే సంస్థలో నాకు రెండో సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో నిర్మాత హన్మంత్‌రావు నాయుడు, ఇతర చిత్రబృందం పాల్గొంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని