అలా వదులుకున్నవి ఎన్నో!

కొన్ని పాత్రలు నటుల ఆలోచనల్ని సమూలంగా  మార్చేస్తుంటాయని చెబుతోంది  అనుపమ పరమేశ్వరన్‌. వరుస అవకాశాలతో కెరీర్‌లో కీలక దశని కొనసాగిస్తున్న  కథానాయిక ఈమె.

Published : 01 Oct 2022 01:57 IST

కొన్ని పాత్రలు నటుల ఆలోచనల్ని సమూలంగా  మార్చేస్తుంటాయని చెబుతోంది  అనుపమ పరమేశ్వరన్‌. వరుస అవకాశాలతో కెరీర్‌లో కీలక దశని కొనసాగిస్తున్న  కథానాయిక ఈమె. ‘కార్తికేయ2’తో విజయాన్ని సొంతం చేసుకుని మరింత జోరు చూపించేందుకు సన్నద్ధం అవుతోంది. నట ప్రయాణంలో తొలినాళ్లకీ, ఇప్పటికీ తనలో చాలా మార్పు కనిపిస్తోందని, అదంతా చేసిన పాత్రల చలవే అని చెప్పిందామె. ‘‘ఆరంభంలో కొన్ని పాత్రలు చేయగానే నాకంటూ ఓ ఇమేజ్‌ వచ్చింది. అప్పట్నుంచి ఆ ఇమేజ్‌కి తగ్గట్టే పాత్రల్ని ఎంపిక చేసుకోవాలనే భ్రమలో ఉండేదాన్ని. కొన్నిసార్లు మనసుకు నచ్చినా చేస్తే వాళ్లూ వీళ్లూ ఏమనుకుంటారనే భయంతో ఆగిపోయేదాన్ని. అలా వదులుకున్నవి చాలానే.  కానీ మధ్యలో చేసిన ఓ పాత్ర, ఓ సినిమా  ప్రయాణం నా ఆలోచనల్ని సమూలంగా మార్చేసింది.  మనసుకు నచ్చినప్పుడు చేయకుండా ఆగిపోవడం తప్పని అర్థమైంది. అప్పట్నుంచి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకున్నా. నచ్చింది చేస్తే ఇంకా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అర్థమైంది’’ అని చెప్పింది అనుపమ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని