Hari Hara Veera Mallu: వీరమల్లు సన్నాహాలు

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎ.దయాకర్‌ రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.

Updated : 01 Oct 2022 14:08 IST

వన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎ.దయాకర్‌ రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికోసమే చిత్ర బృందం ప్రధాన నటీనటులు, కొంత మంది సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా ఓ ప్రీ షెడ్యూల్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసింది. ఇది శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో పవన్‌ కల్యాణ్‌, నిధి అగర్వాల్‌తో పాటు సునీల్‌, సుబ్బరాజు, రఘుబాబు, క్రిష్‌, ఎం.ఎం.కీరవాణి తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోలో పవన్‌ స్క్రిప్ట్‌ విషయమై దర్శకుడు, ఇతర ప్రధాన తారాగణంతో చర్చించడం కనిపించింది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో పవన్‌ ఓ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. వర్క్‌షాప్‌ ముగిశాక అక్టోబర్‌ రెండో వారం తర్వాత నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని