మన సంస్కృతి విలువలకు కళాత్మక వ్యక్తీకరణే సినిమా

సినిమా పరిశ్రమ మాత్రమే కాదని... మన సంస్కృతి విలువల కళాత్మక వ్యక్తీకరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సమున్నతమైన దేశ, సమాజ నిర్మాణంలో సినిమాది కీలక పాత్ర అని ప్రశంసించారు.

Published : 01 Oct 2022 02:04 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆశాపరేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రదానం
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల అందజేత

సినిమా పరిశ్రమ మాత్రమే కాదని... మన సంస్కృతి విలువల కళాత్మక వ్యక్తీకరణ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సమున్నతమైన దేశ, సమాజ నిర్మాణంలో సినిమాది కీలక పాత్ర అని ప్రశంసించారు. కళా రంగంలో ఇతర మాధ్యమాలతో పోల్చితే సినిమా వేసే ముద్ర ఎక్కువన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రదానంతో పాటు 2020 సంవత్సరానికి సంబంధించి 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను దిల్లీలో శుక్రవారం ఆమె ప్రదానం చేశారు. సీనియర్‌ నటి ఆశా పరేఖ్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. ఉత్తమ నటులుగా సూర్య (సూరారై పోట్రు-తెలుగులో ఆకాశమే హద్దు), అజయ్‌ దేవగణ్‌ (తానాజీ), ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లేకుగానూ జ్యోతిక, సుధా కొంగర (సురారై పోట్రు), ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం ‘కలర్‌ఫొటో’కు దర్శక నిర్మాతలు, సందీప్‌రాజ్‌, సాయి రాజేష్‌, ఉత్తమ సంగీత దర్శకుడు తమన్‌ (అల వైకుంఠపురంలో..), ఉత్తమ కొరియోగ్రాఫర్‌ సంధ్యారాజు (నాట్యం), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ ఎడిటర్‌ అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌ (శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌-తమిళం) అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని