‘అంజలి’ చిత్ర స్ఫూర్తితో..

బాల నటులు వేదాంత్‌ వర్మ, ప్రణితా రెడ్డి ముఖ్య పాత్రల్లో శివమ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లిల్లీ’. కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. నేహ ప్రధాన పాత్రలో నటించింది.

Updated : 02 Oct 2022 06:24 IST

బాల నటులు వేదాంత్‌ వర్మ, ప్రణితా రెడ్డి ముఖ్య పాత్రల్లో శివమ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లిల్లీ’. కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. నేహ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, ప్రచార గీతాన్ని దర్శకుడు వి.వి.వినాయక్‌ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘క్యాన్సర్‌పై పోరాటం మీద తీసిన చిత్రమిది. ఆ వ్యాధిని ఓ డైనోసార్‌తో పోలుస్తూ.. పోస్టర్‌ డిజైన్‌ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘32ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ చిత్రానికి స్ఫూర్తి. ఇందులో లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌. ఈరోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసేంత గొప్ప అవకాశాన్నిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర దర్శకుడు శివమ్‌. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘పిల్లల్ని దేవుళ్లంటారు కదా. అలా ఎందుకు అంటారో మా చిత్రం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ లిల్లీ లాంటి బంగారు తల్లి మా ఇంట్లోనూ ఉంటే బావుండు అనుకుంటారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌వీర్‌, శివ కృష్ణ, రాజీవ్‌ పిళ్లై, మిషెల్‌ తదితరులు పాల్గొన్నారు.


‘రుద్రుడు’.. వచ్చేది ఆరోజే

రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. కతిరేసన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. శరత్‌ కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ పోస్టర్‌లో లారెన్స్‌ తలపై గాయంతో సీరియస్‌గా చూస్తూ కనిపించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత కతిరేసన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకున్నాం. కానీ, వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. అందుకే దీన్ని 2023 ఏప్రిల్‌ 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు.


‘సూపర్‌ 30’కి జపాన్‌ సలాం

ణితశాస్త్ర నిపుణుడు, విద్యావేత్త ఆనంద్‌కుమార్‌ జీవితం ఆధారంగా.. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సూపర్‌ 30’. మూడేళ్ల కిందట భారత్‌లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీన్ని ప్రముఖ పంపిణీదారు సంస్థ స్పేస్‌బాక్స్‌ లిమిటెడ్‌ సెప్టెంబరు 23న జపాన్‌లో 50 థియేటర్లలో విడుదల చేసింది. అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శితమవడమే కాదు..చాలాచోట్ల ప్రేక్షకుల నుంచి స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కుతోంది. ఈ సందర్భంగా స్పేస్‌బాక్స్‌ సీఈవో దురైపాండ్యన్‌ మాట్లాడుతూ ‘‘సూపర్‌ 30’కి మేం ఊహించిన దానికంటే స్పందన బాగుంది. ఆనంద్‌కుమార్‌ ఎంతో శ్రమకోర్చి పేద పిల్లల్ని ఐఐటియన్లుగా తీర్చిదిద్దే కథాంశం జపాన్‌ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడి విద్యార్థులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు’ అన్నారు. ఈ చిత్రంలో అమిత్‌ సాధ్‌, మృణాల్‌ ఠాకూర్‌ కీలక పాత్రల్లో నటించారు.


యువతరం ‘మది’లో

శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్‌ తెరకెక్కించిన చిత్రం ‘మది’. రామ్‌ కిషన్‌ నిర్మాత. స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్‌ బైరోజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కొత్తదనం నిండిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. ఈతరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ఉంటుంది’’ అన్నారు.


‘దసరా’లో నాని

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని