Rashmika: ‘ర్యాంబో’ సరసన రష్మిక

సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన ‘ర్యాంబో’ సిరీస్‌ చిత్రాలు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా ఇందులో ఒక సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. రోహిత్‌ ధావన్‌ నిర్మిస్తున్నారు.

Updated : 02 Oct 2022 08:27 IST

సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన ‘ర్యాంబో’ సిరీస్‌ చిత్రాలు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) కథానాయకుడిగా ఇందులో ఒక సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. రోహిత్‌ ధావన్‌ నిర్మిస్తున్నారు. అభిమానుల్లో ఈ చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. సినీవర్గాలు దీనికి సంబంధించి శనివారం ఓ కొత్త కబురు వినిపించాయి. ఇందులో టైగర్‌కి జోడీగా రష్మిక (Rashmika) నటించనున్నట్టు సమాచారం. ‘‘స్క్రూ ఢీలా’తోనే టైగర్‌ష్రాఫ్‌, రష్మిక కలిసి నటించాల్సి ఉంది. వేర్వేరు కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. రోహిత్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఆమెతో చర్చలు జరిపారు. నాయికగా నటించడానికి రష్మిక సుముఖంగా ఉన్నారు’’ అని సినీవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది వేసవి నుంచి చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ మొదలు కానుంది. ‘ర్యాంబో’లో చాలామంది హాలీవుడ్‌ సాంకేతికవర్గ నిపుణులు పని చేయనున్నారు.


కొత్త జోడీ

శ్రీవిష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా...  రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేష్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పకులు. ఈ చిత్రంలో కథానాయికగా రెబా మోనికా జాన్‌ (Reba Monica John) ఎంపికయ్యారు. ఈమె తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించిన కథానాయిక. హాస్యభరితమైన కుటుంబ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణని త్వరలోనే మొదలు పెట్టనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, దేవీప్రసాద్‌, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, కళ: బ్రహ్మ కడలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని