Mohanlal: స్టార్‌...చెఫ్‌..యాక్షన్‌

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చెఫ్‌ అవతారం ఎత్తారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘రామ్‌’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం యూకేలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన తోటి నటుల కోసం సరదాగా వంట చేశారు మోహన్‌ లాల్‌. ఈ విషయాన్ని మరో నటుడు ఇంద్రజిత్‌ సుకుమారన్‌ ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు.

Updated : 03 Oct 2022 14:21 IST

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చెఫ్‌ అవతారం ఎత్తారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘రామ్‌’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం యూకేలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన తోటి నటుల కోసం సరదాగా వంట చేశారు మోహన్‌ లాల్‌. ఈ విషయాన్ని మరో నటుడు ఇంద్రజిత్‌ సుకుమారన్‌ ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ‘‘ఆహారం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. స్టార్‌ చెఫ్‌ ఇన్‌ యాక్షన్‌’ అని పోస్ట్‌ చేశారు ఇంద్రజిత్‌. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఇండియన్‌ రా ఏజెంట్‌ రామ్‌ మోహన్‌ పాత్రలో నటిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని