Sai Pallavi: అలా జరగనప్పుడు చేదు ఫలితమే!

‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నానా? లేదా? అన్నదే నాకు సంతృప్తినిస్తుంది తప్ప.. కథ మొత్తం నా చుట్టూ తిరుగుతుందా? లేదా? అన్నది కాదు’’ అంటోంది నటి సాయిపల్లవి. ఓ పాత్ర ఎలా చేయాలన్న విషయంలో తానెప్పుడూ ఎలాంటి నిబంధనలు పెట్టుకోనని, తన పాత్ర కోసం ముందుగానే ప్రత్యేకంగా సిద్ధమయ్యే ప్రయత్నాలు చేయనని చెప్పింది.

Updated : 03 Oct 2022 13:53 IST

‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నానా? లేదా? అన్నదే నాకు సంతృప్తినిస్తుంది తప్ప.. కథ మొత్తం నా చుట్టూ తిరుగుతుందా? లేదా? అన్నది కాదు’’ అంటోంది నటి సాయిపల్లవి (Sai Pallavi). ఓ పాత్ర ఎలా చేయాలన్న విషయంలో తానెప్పుడూ ఎలాంటి నిబంధనలు పెట్టుకోనని, తన పాత్ర కోసం ముందుగానే ప్రత్యేకంగా సిద్ధమయ్యే ప్రయత్నాలు చేయనని చెప్పింది. సెట్లోని వాతావరణం.. తోటి నటీనటుల అభినయమే తన పాత్ర ఎలా పోషించాలన్న విషయంలో స్పష్టతనిస్తుందని తెలియజేసింది. ఓ కథని చదివేటప్పుడే దాన్ని ఓ సినిమాలా ఆస్వాదించే ప్రయత్నం చేస్తానని చెప్పింది. ‘‘నేనెప్పుడూ ఓ స్క్రిప్ట్‌ని ప్రేక్షకుడు సినిమా ఎలా చూస్తాడో.. అలాగే చదివి ఆస్వాదించే ప్రయత్నం చేస్తా. దాని వల్ల తెరపై నా పాత్ర ఎలా ఉంటుందన్నది ముందే ఓ అవగాహన వస్తుంది. కొన్నిసార్లు మనం పేపర్‌పై చూసిన కథ అదే విధంగా తెరపైకి రాకపోవచ్చు. అలాంటప్పుడు చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పదు. అయితే అదీ ఓ అనుభవ పాఠమే’’ అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని