Adipurush: నా ఆగమనం.. అధర్మ విధ్వంసం

‘‘వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి’’ అంటూ ‘ఆదిపురుష్‌’తో రాముడిగా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని ఓం రౌత్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన చిత్రమిది.

Updated : 03 Oct 2022 04:18 IST

‘‘వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి’’ అంటూ ‘ఆదిపురుష్‌’తో రాముడిగా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని ఓం రౌత్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన చిత్రమిది. రాముడి పాత్రను ప్రభాస్‌ పోషించగా.. సీత పాత్రలో కృతి సనన్‌ నటించింది. లంకేశుడి పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను చిత్ర బృందం అయోధ్య వేదికగా ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ వేడుకలో ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘మొదట ఈ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. అంకిత భావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం... ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నా మనవల్ల కావడంలేదు. అందుకే మనం మనుషులు అయ్యాం, శ్రీరాముడు దేవుడు అయ్యారు’’ అని అన్నారు. ‘‘భూమి కుంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం’’ అంటూ రాముడిగా ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 1:40 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో రామాయణంలోని కీలక ఘట్టాల్ని గ్రాఫిక్స్‌ హంగులతో అందంగా ఆవిష్కరించారు. ‘‘నా ఆగమనం.. అధర్మ విధ్వంసం’’ అంటూ టీజర్‌లో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. టీజర్‌ విడుదలకు ముందు రామమందిరాన్ని సందర్శించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకుంది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్ కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని