RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం జపాన్‌కి!

అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ‘ఈగ’, ‘బాహుబలి’ పలు దేశాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. ‘బాహుబలి’ జపాన్‌లో అనువాదమై విశేష ఆదరణని సొంతం చేసుకుంది.

Updated : 19 Oct 2022 14:20 IST

గ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) సినిమాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ‘ఈగ’, ‘బాహుబలి’ పలు దేశాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. ‘బాహుబలి’ జపాన్‌లో అనువాదమై విశేష ఆదరణని సొంతం చేసుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) కూడా ఇప్పటికే ఓటీటీ వేదికలతో చేరువవుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అమెరికాలో ఇటీవల పలు చోట్ల ప్రత్యేక ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. రాజమౌళి కూడా ఆ ప్రదర్శనలకి హాజరై ప్రేక్షకుల స్పందనని ఆస్వాదించారు. ఆస్కార్‌ పురస్కారాల రేసులో ఉన్న ఈ సినిమాకి అమెరికాలో విస్తృతమైన ప్రచారం లభించింది. ఇక రామ్‌, భీమ్‌ల సందడి జపాన్‌లో షురూ కానుంది. ఈ నెల 21న జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రచారం నిమిత్తం ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan), రాజమౌళి (Rajamouli) జపాన్‌కి బయలుదేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని