సిద్ధమవుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌2’ కథ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కొనసాగింపు ఆలోచన ఉందని ఆ చిత్రం విడుదల తర్వాత జరిగిన ఓ వేడుకలోనే స్పష్టం చేశారు రచయిత విజయేంద్రప్రసాద్‌. ఇప్పుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆ విషయాన్ని ధ్రువీకరించారు.

Published : 14 Nov 2022 01:53 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కొనసాగింపు ఆలోచన ఉందని ఆ చిత్రం విడుదల తర్వాత జరిగిన ఓ వేడుకలోనే స్పష్టం చేశారు రచయిత విజయేంద్రప్రసాద్‌. ఇప్పుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం కొనసాగింపు కథకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో సైతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటోంది. ఇటీవల జపాన్‌లోనూ విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అమెరికాలోని చికాగోలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో రాజమౌళి స్వయంగా పాల్గొన్నారు. ఆస్కార్‌ పురస్కారాల కోసం నేరుగా బరిలోకి దిగిందీ చిత్రం. ‘‘కొనసాగింపు చిత్రం చేయడాన్ని నేనూ ఇష్టపడుతున్నా. దానికి సంబంధించిన వివరాల్ని ఇప్పుడే వెల్లడించలేను. నా సినిమాలకి మా నాన్నే కథా రచయిత. మేం ఇద్దరం ‘ఆర్‌ఆర్‌ఆర్‌2’ గురించి మాట్లాడుకున్నాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఆయన తదుపరి మహేష్‌తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని