ప్రపంచ స్థాయి చిత్రం... హను-మాన్‌

‘‘చిన్నప్పటి నుంచి పౌరాణికాలంటే చాలా ఇష్టం. తొలిసారి పూర్తిస్థాయి పౌరాణిక పాత్ర అయిన హనుమాన్‌ నేపథ్యంలో సినిమా చేశా’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హను - మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. అమృత అయ్యర్‌ కథానాయిక. కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

Updated : 22 Nov 2022 10:51 IST

‘‘చిన్నప్పటి నుంచి పౌరాణికాలంటే చాలా ఇష్టం. తొలిసారి పూర్తిస్థాయి పౌరాణిక పాత్ర అయిన హనుమాన్‌ నేపథ్యంలో సినిమా చేశా’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హను - మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. అమృత అయ్యర్‌ కథానాయిక. కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. విజువల్‌గా ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఆవిష్కరించిందీ టీజర్‌. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘మన సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కార్తికేయ2’ పాన్‌ ఇండియాతోపాటు, పాన్‌ వరల్డ్‌ స్థాయికి వెళ్లాయి. మా ‘హను -మాన్‌’ని కూడా అలా అన్ని భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాగా చేశాం. అంజనాద్రి అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. అక్కడ జరిగే కథే ఇది. విజువల్స్‌తో అబ్బురపరిచేలా ఉంటుంది. ఈ పాత్రని తేజ చేస్తేనే బాగుంటుందని తనని ఎంపిక చేసుకున్నాం. మొదట అనుకున్న వ్యయం కంటే, ఆరింతలు ఎక్కువైంది. అయినా సరే, రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేయాలంటూ సహకారం అందించారు నిర్మాత. అందుకు తగ్గట్టే ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. కథానాయకుడు తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘ఓ గొప్ప పాత్రలో నటించే అవకాశం వచ్చింది. న్యాయం చేస్తానని నన్ను నమ్మిన దర్శకుడు ప్రశాంత్‌కి కృతజ్ఞతలు. నిజాయతీగా చేసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని పంచుతుంది. నాలుగు సినిమాల కష్టం ఈ ఒక్క సినిమా కోసం పడ్డాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్‌, గెటప్‌ శ్రీనుతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని