Cinema news: సినిమా ముచ్చట్లు.. కొత్త విశేషాలు
‘సర్కస్’ చిత్రంతో యాక్షన్‌తో పాటు నవ్వులు పంచడానికి సిద్ధమయ్యారు రోహిత్ శెట్టి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కస్’. రణ్‌వీర్‌సింగ్, పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
వినోదాల ‘సర్కస్’
‘సర్కస్’ చిత్రంతో యాక్షన్‌తో పాటు నవ్వులు పంచడానికి సిద్ధమయ్యారు రోహిత్ శెట్టి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కస్’. రణ్‌వీర్‌సింగ్, పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మీ కుటుంబానికి వినోదం పంచడానికి క్రిస్మస్కు వస్తున్నాం’ అని తెలియజేసింది చిత్రబృందం. డిసెంబరు 2న ఈ సినిమాని ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
ఆస్పత్రి నుంచి కమల్ డిశ్చార్జి
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ ఒకరోజు పూర్తిగా చికిత్స తీసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అనంతరం శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
- న్యూస్‌టుడే, కోడంబాక్కం
‘మానాడు’కు సీక్వెల్?
శింబు కెరీర్‌ను మళ్లీ గాడిన పడేసిన చిత్రం ‘మానాడు’. అబ్దుల్ కలిక్గా శింబు నటన ప్రేక్షకుల్ని అలరించింది. ఓ టైమ్ లూప్‌లో బంధీ అయిన పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఈ సినిమా విడుదలై సంవత్సరం గడిచింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ సినిమా మేకింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది. అందులో ‘లూప్ కంటిన్యూస్ సూన్’ అని ఉంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెప్పింది చిత్రబృందం. తొలి చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించారు.
ఇంతకీ నేనెవరు?
బాలకృష్ణ, సాక్షి చౌదరి జంటగా నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించిన చిత్రం ‘నేనెవరు’. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ‘‘ప్రేమ, సస్పెన్స్‌తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తుంది’’ అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.జి.సారథి, ఛాయాగ్రహణం: సామల భాస్కర్.
వెన్నెల.. నా వెన్నెల
‘టాప్ గేర్’తో దూసుకొస్తున్నారు కథానాయకుడు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.శశికాంత్ తెరకెక్కించారు. కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్ కథానాయిక. సుమన్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఈ చిత్రంలోని ‘‘వెన్నెల వెన్నెల.. నా వెన్నెల’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘‘ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రమిది. అన్ని రకాల వాణిజ్య హంగులు పుష్కలంగా ఉన్నాయి. నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు