Ukku Satyagraham: విశాఖ ఉక్కు కోసం తెలుగు వారు ఏకమవ్వాలి

పి.సత్య రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. మేఘన లోకేష్‌, గద్దర్‌, ఎం.వి.వి.సత్య నారాయణ, అయోధ్య రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 26 Nov 2022 08:23 IST

పి.సత్య రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ (Ukku Satyagraham). మేఘన లోకేష్‌, గద్దర్‌, ఎం.వి.వి.సత్య నారాయణ, అయోధ్య రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని ప్రధానంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం రచయత సుద్దాల అశోక్‌ తేజ రాసిన గీతాన్ని చిత్ర బృందం హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అని నినాదాలు చేస్తుంటే దాన్ని ఈరోజున ప్రైవేటీకరణ చేయడం న్యాయమా? ఈ అంశంపైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ సినిమాని తీశారు సత్యారెడ్డి. రాజకీయ పార్టీలు ఈ ప్రైవేటీకరణను ఆపాలి’’ అన్నారు. ‘‘ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిదీ. తెలుగు వారంతా ఏకమైతేనే ఈ ప్రైవేటీకరణను ఆపగలరని నమ్ముతున్నా’’ అన్నారు గద్దర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని