Pushpa 2: రష్యాకు ‘పుష్ప’

‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు హిందీలోనూ సత్తా చాటింది.

Updated : 26 Nov 2022 08:30 IST

‘పుష్ప’ (Pushpa) చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్‌ (Allu Arjun). సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు హిందీలోనూ సత్తా చాటింది. రష్మిక (Rashmika) కథానాయికగా నటించిన ఈ సినిమాని వచ్చే నెల్లో రష్యాలో విడుదల చేస్తున్నారు. అందుకోసం బన్నీ రష్యాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని చూసి అక్కడివారు ఎలా స్పందిస్తారో చూడాలని అల్లు అర్జున్‌ రష్యాకి వెళుతున్నారట. మరో పక్క ‘పుష్ప 2’ చిత్రీకరణతోనూ బిజీగా ఉన్నారాయన. తొలి చిత్రాన్ని మించిన భారీ హంగులతో ఈ చిత్రం రూపొందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని