Jai Balayya: తెలుగు పౌరుషాల రూపం.. అలనాటి రాయలోరి తేజం

నందమూరి బాలకృష్ణ తెరపై కనిపించినా.. ప్రచార వేడుకల్లో సందడి చేసినా ‘జై బాలయ్య’ అనే నామస్మరణ మారు మోగాల్సిందే.

Updated : 26 Nov 2022 04:55 IST

నందమూరి బాలకృష్ణ తెరపై కనిపించినా.. ప్రచార వేడుకల్లో సందడి చేసినా ‘జై బాలయ్య’ అనే నామస్మరణ మారు మోగాల్సిందే. అభిమానులు, సినీప్రియులు ప్రేమగా పిలుచుకునే ఆ నినాదాన్ని ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ కోసం పాటగా మార్చారు సంగీత దర్శకుడు తమన్‌. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ‘‘జై బాలయ్య’’ ఆంథమ్‌ని విడుదల చేశారు. ‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా.. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా’’ అంటూ బాలయ్య పాత్రను ఆవిష్కరిస్తూ సాగే గీతమిది. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా.. కరీముల్లా ఆలపించారు. శంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. మాస్‌ యాక్షన్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకి సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు