Akhanda 2: కథ సిద్ధం..

విజయవంతమైన చిత్రాలకు సీక్వెన్స్‌ రూపొందించడంపైనే మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. చాలారకాలుగా కలిసొచ్చే అవకాశం ఉండటంతో కొనసాగింపు చిత్రాలు విరివిగా రూపొందుతున్నాయి.

Updated : 28 Nov 2022 07:04 IST

విజయవంతమైన చిత్రాలకు సీక్వెన్స్‌ రూపొందించడంపైనే మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. చాలారకాలుగా కలిసొచ్చే అవకాశం ఉండటంతో కొనసాగింపు చిత్రాలు విరివిగా రూపొందుతున్నాయి. ‘అఖండ’ విడుదల తర్వాత ‘అఖండ 2’ (Akhanda 2) ఆలోచన కూడా ఉందని ఇదివరకే దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్పష్టం చేశారు. కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) సైతం తాజాగా ఆ ప్రాజెక్టుపై స్పష్టతనిచ్చారు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘అఖండ’ సినిమా ప్రదర్శితమైన సందర్భంగా అక్కడే ‘అఖండ 2’ గురించి మాట్లాడారు. ‘‘కథ కూడా సిద్ధం చేశాం. ఎప్పుడు చేస్తామనే విషయంపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంద’’ని చెప్పారు బాలకృష్ణ. ఆయన ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్‌ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు. తన వారసుడు మోక్షజ్ఞని వచ్చే ఏడాది పరిచయం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు బాలకృష్ణ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని