ప్రేమకథల శీతాకాలం
సహజమైన మూడు ప్రేమకథల సమాహారమే మా చిత్రం అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తమన్నా, కావ్య శెట్టి, మేఘ ఆకాష్ కథానాయికలు.
సహజమైన మూడు ప్రేమకథల సమాహారమే మా చిత్రం అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తమన్నా, కావ్య శెట్టి, మేఘ ఆకాష్ కథానాయికలు. నాగశేఖర్ దర్శకత్వం వహించారు. రామారావు చింతపల్లి, భావనా రవి, నాగ శేఖర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నాగశేఖర్ పది నిమిషాలు కథ చెప్పగానే సినిమా చేస్తానని చెప్పా. తమన్నా ఎప్పుడూ చేయని పాత్రని ఇందులో చేశారు. యువతరం ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘గాడ్‌ఫాదర్’లో చేసిన పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో పాత్ర కూడా అంతకుమించి ఆకట్టుకుంటుంది. చాలా కష్టాల్ని ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం. వాణిజ్యం పరంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ ‘‘ఇందులోని ప్రేమకథలు సాధారణంగా ఉండవు, ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తాయి. లక్ష్మీభూపాల్ మాటలు ఈ చిత్రాన్ని మురో స్థాయిలో నిలబెడతాయి. మా నటులు శీతాకాలం మేజిక్‌ని సృష్టిస్తార’’న్నారు. ఇందులోని ఓ మంచి పాత్రో నవ్విస్తానని చెప్పారు ప్రియదర్శి. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు ఎం.సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Prithvi Shaw: భారత ఓపెనర్‌గా పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04/02/2023)
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Sports News
Virat: విరాట్ కొట్టిన ఆ ‘స్ట్రెయిట్ సిక్స్’.. షహీన్ బౌలింగ్‌లో అనుకున్నా: పాక్ మాజీ పేసర్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Politics News
Rahul letter to modi : మోదీజీ.. కశ్మీరీ పండిట్లపై కనికరం చూపండి: రాహుల్