కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం

‘‘కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది’’ అంటూ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తాను చేయనున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు బుచ్చిబాబు సానా.

Published : 29 Nov 2022 02:11 IST

‘‘కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది’’ అంటూ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తాను చేయనున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ‘ఉప్పెన’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో...  సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. కథానాయకుడు రామ్‌చరణ్‌కి ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని బుచ్చిబాబు శక్తిమంతమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారనీ, పాన్‌ ఇండియా స్థాయిలో అధిక నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. క్రీడా నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. రామ్‌చరణ్‌ స్పందిస్తూ ‘‘బుచ్చిబాబు, ఆయన బృందంతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నా’’  అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని