టైగర్‌తో సారా యాక్షన్‌

యాక్షన్‌ చిత్రాలకు చిరునామాగా మారుతున్న యువ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ నుంచి జగన్‌ శక్తి దర్శకత్వంలో మరో యాక్షన్‌ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.

Published : 01 Dec 2022 02:02 IST

యాక్షన్‌ చిత్రాలకు చిరునామాగా మారుతున్న యువ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ నుంచి జగన్‌ శక్తి దర్శకత్వంలో మరో యాక్షన్‌ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా సారా అలీఖాన్‌ను తీసుకున్నారట. త్వరలోనే ఆమె చిత్రీకరణలో పాల్గొననుంది. ఓ కొత్త జంటను ప్రేక్షకులకు చూపించాలని చిత్రబృందం భావిస్తోంది. దీంతో సారా అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆమెకు కూడా కథ బాగా నచ్చింది’’అని చిత్రవర్గాలు చెప్పినట్లు సమాచారం. మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు యూరప్‌లోనూ ఈ నెల 10 నుంచి చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యాక్షన్‌ చిత్రం కావడంతో స్టంట్లు అన్ని అదిరిపోయేలా ఉండాలని, దానికి తగ్గట్లు బడ్జెట్‌ కేటాయించారట చిత్ర నిర్మాతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని