అది ఒత్తిడి కాదు

‘‘పని చేయడాన్ని ఎప్పుడూ ఒత్తిడిగా భావించను’’ అంటోంది నటి పూజా హెగ్డే. తెలుగు, హిందీ అని తేడాల్లేకుండా ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది పూజ.

Published : 02 Dec 2022 02:27 IST

‘‘పని చేయడాన్ని ఎప్పుడూ ఒత్తిడిగా భావించను’’ అంటోంది నటి పూజా హెగ్డే. తెలుగు, హిందీ అని తేడాల్లేకుండా ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది పూజ. మరి ఇంతలా పని చేయడం ఒత్తిడిగా ఏమన్నా అనిపిస్తుందా? అని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది బుట్టబొమ్మ. ‘‘నాకు పని చేయడమంటే చాలా ఇష్టం. దాన్ని ఒత్తిడిగా ఎప్పుడూ అనుకోను. నా కలల్ని చాలా వరకు నిజం చేసుకోగలిగినా.. ఈరోజున నేను ఈస్థాయికి చేరుకోగలిగినా సినిమాల ద్వారా నేను పొందిన పనే కారణం. అందుకే ఆ పనిలోకి దూకేందుకు ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తుంటా. నిరంతరం పనిలో ఉండటం వల్ల ఉన్న మరో ప్రయోజనం ఏంటంటే.. తక్కువగా మాట్లాడతాం (నవ్వుతూ)’’ అని చెప్పుకొచ్చింది పూజ.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు