Cirkus: మా అందరికీ షారుక్‌ ఆదర్శం

సర్కస్‌ చిత్రంతో వినోదాలు పంచడానికి సిద్ధమవుతున్నారు రణ్‌వీర్‌సింగ్‌. ఆయన ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

Updated : 03 Dec 2022 08:56 IST

‘సర్కస్‌’ ట్రైలర్‌ వేడుకలో రణ్‌వీర్‌

ర్కస్‌ (Cirkus) చిత్రంతో వినోదాలు పంచడానికి సిద్ధమవుతున్నారు రణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh). ఆయన ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం ముంబయిలో జరిగింది. ఈ వేడుకలో షారుక్‌పై అభిమానాన్ని చాటుకున్నారు రణ్‌వీర్‌సింగ్‌. ‘‘నాకే కాదు చాలామందికి షారుక్‌ఖాన్‌ ఆదర్శం. మేమందరం ఆయన్ని చూసే నటులయ్యాం. ఆయన సాధించిన దానిలో కొంచెం సాధించిన అది నాకు చాలా గొప్ప విజయం’’అని చెప్పారు రణ్‌వీర్‌. సర్కస్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 1960ల నాటి పరిస్థితులు అందులో కనిపిస్తాయి. ఇందులోని ఐటెమ్‌సాంగ్‌లో దీపికా తళుక్కున మెరిసి అలరించింది. షేక్‌స్పియర్‌ నాటకం ‘కామెడీ ఎర్రర్స్‌’ ఆధారంగా ఇది తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని