Keerthy Suresh: నిజమా... కాదా?
కీర్తి సురేశ్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులోనే చిరంజీవితో కలిసి ‘భోళాశంకర్’, నానితో కలిసి ‘దసరా’ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలోనూ కీలకమైన సినిమాలు చేస్తోంది.
కీర్తి సురేశ్ (Keerthy Suresh) చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులోనే చిరంజీవితో కలిసి ‘భోళాశంకర్’, నానితో కలిసి ‘దసరా’ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలోనూ కీలకమైన సినిమాలు చేస్తోంది. ఇంకా ప్రకటించని మరో సినిమాని కూడా చేస్తున్నట్టు ఆమె ఈమధ్యే ఇన్‌స్టాలో పేర్కొంది. నటిగా ఆమె జోరు ఇలా సాగుతుంటే... మరోవైపు కొత్త ప్రయాణం దిశగా అడుగులు వేస్తోందంటూ సరికొత్త ప్రచారం ఊపందుకుంది. చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోందన్నదే ఆ ప్రచారం. కథానాయికగా ఇన్ని సినిమాలు చేస్తున్న కీర్తి ఇప్పుడు కొత్త అడుగులు వేసే సాహసం చేస్తుందా అనేదే ప్రశ్న. ఆమె సన్నిహితులు మాత్రం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలేవీ లేవంటున్నారు. కానీ కీర్తి మాత్రం కథల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాణం ఆమెకి కొత్తేమీ కాదు. కీర్తి తండ్రి సురేశ్ కుమార్ మలయాళంలో పలు చిత్రాలు నిర్మించారు. మరి భవిష్యత్తులో తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నిర్మాణంలోనూ ఓ చేయి వేస్తారేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్