Keerthy Suresh: విప్లవం ఇంటి నుంచే మొదలవుతుంది!

‘కేజీఎఫ్‌’, ‘కాంతార’ వంటి విజయంతమైన చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌.

Updated : 05 Dec 2022 06:46 IST

‘కేజీఎఫ్‌’, ‘కాంతార’ వంటి విజయంతమైన చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films). ఇప్పటికే తెలుగులో ‘సలార్‌’ వంటి భారీ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు తమిళ చిత్రసీమ వైపు దృష్టి సారించింది. కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో ‘రఘు తాత’ (Raghu Thatha) అనే సినిమాని నిర్మిస్తోంది. ఇది హోంబలే ఫిల్మ్స్‌కు తొలి తమిళ సినిమా. దీన్ని సుమన్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ‘‘విప్లవం ఇంటి నుంచి మొదలవుతుంది’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను జోడించారు. ‘‘ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా చిత్రం. దృఢ సంకల్పం కలిగిన ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాట గాథగా కనిపిస్తుంది’’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమాని తమిళం పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో ‘భోళా శంకర్‌’, నానితో ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని