బాలకృష్ణకు జోడీగా ప్రియాంక?

‘టాక్సీవాలా’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన అందం ప్రియాంక జవాల్కర్‌. ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత అదే స్థాయిలో జోరు చూపలేకపోయింది.

Published : 06 Dec 2022 01:20 IST

‘టాక్సీవాలా’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన అందం ప్రియాంక జవాల్కర్‌. ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత అదే స్థాయిలో జోరు చూపలేకపోయింది. ఆమె ‘గమనం’ తర్వాత ఇంత వరకు మరో కొత్త కబురు వినిపించలేదు. అయితే ఇప్పుడామె ఓ క్రేజీ అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియాంక సందడి చేయనుందని సమాచారం. ఇప్పటికే ఆమెపై ఓ ఫొటో షూట్‌ కూడా నిర్వహించినట్లు తెలిసింది. శక్తిమంతమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈనెల 8న చిత్రీకరణ ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా బాలకృష్ణపై పోరాట ఘట్టాలు తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించనున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని