RGV: వాటిని పట్టించుకోను

‘‘నా ఆలోచనల్ని నేను అనుకున్నట్లుగా నా శక్తి సామర్థ్యాలతో తెరపైకి తీసుకురావడమే నా పని. అంతేకానీ, దాన్ని చూసి ఎవరెలా స్పందిస్తారు? ఏమనుకుంటారు? అన్నది నేనెప్పుడూ పట్టించుకోను’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.

Updated : 07 Dec 2022 07:04 IST

‘‘నా ఆలోచనల్ని నేను అనుకున్నట్లుగా నా శక్తి సామర్థ్యాలతో తెరపైకి తీసుకురావడమే నా పని. అంతేకానీ, దాన్ని చూసి ఎవరెలా స్పందిస్తారు? ఏమనుకుంటారు? అన్నది నేనెప్పుడూ పట్టించుకోను’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV). ఇప్పుడాయన నుంచి వస్తున్న చిత్రం ‘డేంజరస్‌’ (Dangerous). అప్సర రాణి (Apsara Rani), నైనా గంగూలి (Naina Ganguly) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో వర్మ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో నాయకానాయికల నేపథ్యంలో సాగే కథల్నే చూశాం. కానీ, ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రానికి అప్సర రాణి, నైనా గంగూలి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజానికి ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ధైర్యం కావాలి’’అన్నారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘ఏపీ రాజకీయాల నేపథ్యంలో రెండు భాగాల చిత్రం చేయనున్నా. తొలి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే పేర్లు ఖరారు చేశాం. జగన్‌ కేంద్రంగా సాగే కథతోనే రూపొందుతుంది. రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉద్భవించాయి.. దాన్ని ఉపయోగించుకొని ఎదిగేందుకు ఎవరెలాంటి వ్యూహాలు పన్నారు? అన్నది ‘వ్యూహం’లో చూపించనున్నాం. జనవరిలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌తో ఓ బాలీవుడ్‌ సినిమా చేయనున్నా’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని