Priyanka Chopra: రంగు ఎక్కువున్న వాళ్లకంటే గొప్ప నటినే!

చాలా వేగంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా.

Updated : 08 Dec 2022 06:51 IST

చాలా వేగంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఆమె నటి, నిర్మాత, రచయిత్రి, గాయకురాలు, వ్యాపార వేత్త ఇలా పలు విధాలుగా తనను తాను ఆవిష్కరించుకుంది. అందాల దేవత, అపూర్వ సుందరి ఇలా ఎన్నో రకాలుగా ఆమె కీర్తిస్తుంది సినీ లోకం. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె శరీర రంగు మీద మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేసేవారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది. ‘‘సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బ్లాక్‌ క్యాట్‌, డస్కీ అంటూ కొందరు నన్ను విమర్శించేవారు. నా కంటే మంచి రంగున్న నాయికలు చాలామంది కంటే నేను గొప్ప నటినే అని నా భావనతో జీవితంలో ముందుకెళ్లిపోయాను. అప్పుడు ఆ విమర్శల్ని పట్టించుకునుంటే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదేమో’’అని చెప్పింది ప్రియాంక. కెరీయర్‌ కొత్తలో హీరోల పారితోషికంలో పదిశాతం కూడా నాకు దక్కేది కాదు అంటూ పారితోషికం విషయంలోనూ వివక్ష గురించి మనసులో మాటను ఆమె పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని