Deepika Padukone: లేడీ సింగం

రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌లో భాగంగా ‘సింగం’ సిరీస్‌లో మూడో చిత్రంగా ‘సింగం ఎగైన్‌’ రానున్న విషయం తెలిసిందే.

Updated : 09 Dec 2022 07:09 IST

రోహిత్‌ శెట్టి (Rohit Shetty) కాప్‌ యూనివర్స్‌లో భాగంగా ‘సింగం’ (Singham) సిరీస్‌లో మూడో చిత్రంగా ‘సింగం ఎగైన్‌’ రానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పోలీస్‌ అధికారిగా మూడోసారి అజయ్‌దేవ్‌గణ్‌ సందడి ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దాంతో పాటు ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం ‘సర్కస్‌’ సినిమా వేడుకలో రోహిత్‌ శెట్టే చెప్పేశారు. ఈ చిత్రంలోని ‘కరెంట్‌ లగా రే..’ పాట విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ పాటలో రణ్‌వీర్‌సింగ్‌ సరసన ఆడిపాడింది దీపికా పదుకొణె (Deepika Padukone). ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత తిరిగి దీపకతో మళ్లీ ఎప్పుడు పని చేస్తారు? అని రోహిత్‌శెట్టిని ఈ వేడుకలో పాత్రికేయులు అడగ్గా..‘ఈమే మా లేడీ సింగం’ అంటూ దీపిక పేరుని ప్రకటించారు రోహిత్‌. వచ్చే ఏడాది సాధ్యమైనంత తొందరగా కలిసి పనిచేస్తాం అని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని