Connect: లాక్‌డౌన్‌కు 24గంటల ముందు

99 నిమిషాల హారర్‌ ప్రపంచాన్ని ఏకధాటిగా ఆస్వాదించాలంటే మా ‘కనెక్ట్‌’ చూడాల్సిందే అంటోంది ఆ చిత్రబృందం. నయనతార ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రమిది.

Updated : 10 Dec 2022 06:45 IST

99 నిమిషాల హారర్‌ ప్రపంచాన్ని ఏకధాటిగా ఆస్వాదించాలంటే మా ‘కనెక్ట్‌’ (Connect) చూడాల్సిందే అంటోంది ఆ చిత్రబృందం. నయనతార (Nayanthara) ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రమిది. అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రలు పోషించారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. విఘ్నేష్‌ శివన్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 22న  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది యు.వి.క్రియేషన్స్‌. శుక్రవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘దేశంలో లాక్‌డౌన్‌ విధించడానికి 24 గంటల ముందు అంతా బాగుంది...’  అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్‌ ఆసక్తిని  రేకెత్తిస్తోంది. ‘‘నయనతార ఓ అమ్మాయికి  తల్లిగా కనిపించనుంది. భయపెడుతూ థ్రిల్‌ని పంచే చిత్రమిద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్‌, ఛాయాగ్రహణం: మణికంఠన్‌, కృష్ణమాచారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని