Saindhav: సైంధవ్‌ మొదలు

వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను (Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Updated : 27 Jan 2023 06:52 IST

వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను (Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా.. దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. రానా, నాగచైతన్య, సురేష్‌బాబు స్క్రిప్ట్‌ అందించారు. నాని, బి.గోపాల్‌, ఎంఎస్‌ రాజు, మైత్రి నవీన్‌, శిరీష్‌ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది వెంకటేష్‌ నటిస్తున్న 75వ చిత్రం (Venky 75). ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, కూర్పు: గ్యారీ బీహెచ్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.మణికందన్‌.


‘సర్కారు నౌకరి’ షురూ

గాయని సునీత (Sunitha) తనయుడు ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్‌ దర్శకుడు. భావనా వళపండల్‌ కథానాయిక. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా.. సునీత కెమెరా స్విచ్చాన్‌ చేశారు. రామ్‌ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాకి శాండిల్య స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని