Sharwanand: కొత్త అధ్యాయానికి శ్రీకారం

యువ కథానాయకుడు శర్వానంద్‌ (Sharwanand) జీవితంలో ఓ కొత్త అధ్యాయం శ్రీకారం చుట్టుకుంది. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. రక్షితా రెడ్డితో పెళ్లి పీటలెక్కనున్నారు.

Updated : 27 Jan 2023 06:49 IST

రక్షితా రెడ్డితో పెళ్లి పీటలెక్కనున్న హీరో శర్వానంద్‌
ఘనంగా నిశ్చితార్థ వేడుక

యువ కథానాయకుడు శర్వానంద్‌ (Sharwanand) జీవితంలో ఓ కొత్త అధ్యాయం శ్రీకారం చుట్టుకుంది. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. రక్షితా రెడ్డి (Rakshita Reddy)తో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుక గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌ సతీసమేతంగా హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాని, రానా, అల్లరి నరేష్‌, సిద్ధార్థ్‌, నితిన్‌, అదితీరావు హైదరి, శ్రీకాంత్‌, తరుణ్‌ తదితరులు సైతం ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. శర్వాకు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌ రెడ్డి హైకోర్టు న్యాయవాది. తల్లి సుధారెడ్డి. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్నారు. శర్వానంద్‌ గతేడాది ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. త్వరలో శ్రీరామ్‌ ఆదిత్యతో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారని సమాచారం.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు