Jamuna: బహుభాషా నటి జమున

‘‘జమున (jamuna) బహుభాషా నటి. మాతృభాష కన్నడమైనా.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

Updated : 28 Jan 2023 07:18 IST

‘‘జమున (Jamuna) బహుభాషా నటి. మాతృభాష కన్నడమైనా.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం’’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి (Chiranjeevi). ‘‘జమున చేసిన వైవిధ్యభరితమైన పాత్రలు.. చిత్ర పరిశ్రమ కోసం ఆమె చేసిన కృషిని, చిరకాలం గుర్తుంచుకుంటామ’’న్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ‘‘అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా.. అన్నింటికీ మించి తెలుగు వారి సత్యభామగా జమున మనల్ని ఎంతో మెప్పించార’’ని గుర్తు చేసుకున్నారు కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). జమున మృతి పట్ల పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. ‘‘జమున.. గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ లాంటి ఎన్నో మరపురాని చిత్రాల్లో, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో చెరగని ముద్ర వేశార’’ని కొనియాడారు జూ.ఎన్టీఆర్‌ (NTR). వీరితో పాటు నితిన్‌, సుశాంత్‌, బాబీ, నందిని రెడ్డి తదితర సినీప్రముఖులు జమున మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని