Pushpa 2: పరిచయ గీతం కోసం

అగ్ర తారల సినిమాలు ఇప్పుడు లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా కాన్వాస్‌లో రూపొందుతున్నాయి. వాటిలో కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, పరిచయ గీతాల్ని మరోస్థాయిలో తెరకెక్కిస్తుంటారు.

Updated : 29 Jan 2023 07:25 IST

గ్ర తారల సినిమాలు ఇప్పుడు లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా కాన్వాస్‌లో రూపొందుతున్నాయి. వాటిలో కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, పరిచయ గీతాల్ని మరోస్థాయిలో తెరకెక్కిస్తుంటారు. వాటితో అభిమానుల్ని మరింతగా కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంటారు.  ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) బృందం కూడా ప్రస్తుతం అదే పనిలోనే ఉంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. కథానాయకుడి పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ని తీర్చిదిద్ది చిత్రీకరణ చేస్తున్నారు. మరికొన్ని రోజుల చిత్రీకరణ అనంతరం చిత్రబృందం హైదరాబాద్‌ తిరిగి రానుంది. వచ్చే నెలలో మరో కొత్త షెడ్యూల్‌ని ఆరంభిస్తారు. వచ్చే నెలలోనే కథానాయిక రష్మిక (Rashmika) ఈ సెట్లోకి అడుగు పెట్టనుంది. విజయవంతమైన ‘పుష్ప: ది రైజ్‌’కి  కొనసాగింపుగా రూపొందుతున్న ఈ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.  సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని