డీజే సందడి షురూ..

దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, కథానాయకుడు విక్కీ కౌశల్‌ కలయికలో పట్టాలెక్కుతున్న చిత్రం ‘ఆల్మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌’.

Published : 30 Jan 2023 01:19 IST

ర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, కథానాయకుడు విక్కీ కౌశల్‌ కలయికలో పట్టాలెక్కుతున్న చిత్రం ‘ఆల్మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌’. ఇది ఎవరి కథ? ఇందులో విక్కీ కౌశల్‌ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో చాలా అంచనాలు, ఊహాగానాలే ఉన్నాయి. వీటన్నింటికీ ఆదివారం తెర దించారు. స్పష్టతనిచ్చారు. ఇందులో విక్కీ కౌశల్‌ డీజే మొహబ్బత్‌గా కనిపించనున్నారని అనురాగ్‌ కశ్యప్‌ ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో విక్కీ డీజేగా సందడి చేస్తూ కనిపించారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో విక్కీ కౌశల్‌ విభిన్నమైన పాత్ర పోషించాడంటోంది నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌. అలాయా ఎఫ్‌, కరణ్‌ మెహతా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు