వేసవి బరిలో స్పై

‘కార్తికేయ2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో నిఖిల్‌. ఇటీవలే ‘18పేజెస్‌’తో మరోసారి సత్తా చాటారు. ఇప్పుడు ‘స్పై’గా థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 31 Jan 2023 01:24 IST

‘కార్తికేయ2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో నిఖిల్‌. ఇటీవలే ‘18పేజెస్‌’తో మరోసారి సత్తా చాటారు. ఇప్పుడు ‘స్పై’గా థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఛాయాగ్రహకుడు బీహెచ్‌.గ్యారీ తెరకెక్కిస్తున్న తొలి చిత్రమిది. కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిఖిల్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ కొత్త లుక్‌ను పంచుకున్నారు. అందులో ఆయన స్పైగా గన్‌ పట్టుకొని స్టైలిష్‌ లుక్‌తో కనిపించారు. వినూత్నమైన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా ఐశ్వర్య మేనన్‌ నటిస్తోంది. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని