Suvarna Sundari: సువర్ణ సుందరి వచ్చేస్తోంది

పూర్ణ (Poorna), సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో సురేంద్ర మాదారపు తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ఎమ్‌.ఎమ్‌.లక్ష్మీ నిర్మాత.

Updated : 01 Feb 2023 06:51 IST

పూర్ణ (Poorna), సాక్షి చౌదరి (Sakshi Choudhary) ప్రధాన పాత్రల్లో సురేంద్ర మాదారపు తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణ సుందరి’ (Suvarna Sundari). ఎమ్‌.ఎమ్‌.లక్ష్మీ నిర్మాత. సాయికుమార్‌, కోట శ్రీనివాస్‌, నాగినీడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌, డిజిటల్‌ టికెట్‌ను నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ.. ‘‘విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న చిత్రమిది. ఎక్కడా రాజీ పడకుండా మంచి నిర్మాణ విలువలతో రూపొందించాం. ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: యెల్లుమహంతి ఈశ్వర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని